యమహా కంపెనీ జపనీస్ మార్కెట్ లో ట్రైసిటీ స్కూటర్ ను విడుదల చేసింది. ఈ స్కూటర్ 125 సీసీ, 155 సీసీ విభాగంలో అందుబాటులో ఉన్నాయి. ఈ స్కూటర్ కి ముందు భాగంలో 2 చక్రాలు, వెనుక ఒక చక్రం ఉంటుంది. ఈ స్కూటర్ లోని 125 సీసీ ఇంజిన్ 12.06 బిహెచ్పి పవర్, 11.2 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. 155 సీసీ ఇంజిన్ 14.88 బిహెచ్పి పవర్, 14 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. జపనీస్ మార్కెట్ లో ట్రైసిటీ 125 స్కూటర్ ధర రూ.4,95,000 యెన్లు (రూ.3.10 లక్షలు), 155 స్కూటర్ ధర 5,56,500 యెన్లు (రూ.3.54 లక్షలు) గా ఉంది.