ప్రెస్ మీట్ లో భాగంగా ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అసహనానికి గురయ్యారు. పాత్రికేయులు మర్యాదగా వ్యవహరించడం లేదని విమర్శించిన బైడెన్ తనకు బ్రేక్ కావాలంటూ బయటకు వెళ్లిపోయారు. 'ప్రెసిడెంట్ బైడెన్, చైనాలో ఉన్న మీ కుటుంబ వ్యాపార సంబంధాలు ఆ దేశంతో వ్యవహరించే విషయంలో రాజీకి కారణమైందా?' అని ఓ రిపోర్టర్ ప్రశ్నించారు. ఆ విమర్శను తోసిపుచ్చేలా నవ్విన బైడెన్ 'నాకు కొంచెం బ్రేక్ కావాలి' అని స్పందించారు.