కొత్త వెర్షన్లు అప్ డేట్ చేసుకోకుండా పాత వెర్షన్లే వాడుతున్న ఐఫోన్ యూజర్ల ఫోన్లను హ్యాకర్లు సులువుగా హ్యాక్ చేస్తున్నారని కేంద్రం తెలిపింది. ఎక్కువగా 16.3.1, అంతకంటే ముందు వెర్షన్లతో పాటు ఐఫోన్ 8, ఐపాడ్ ప్రో, ఐపాడ్ ఎయిర్ థర్డ్ జనరేషన్, ఐపాడ్ ఎయిర్ ఫిప్త్ జనరేషన్, ఐపాడ్ మినీ ఫిప్త్ జనరేషన్ ఫోన్లు హ్యాకింగ్ కు గురవుతున్నాయని పేర్కొంది. అలాగే, శాంసంగ్ గెలాక్సీ యూజర్లు కూడా కొత్త వెర్షన్లు అప్ డేట్ చేసుకోవాలని హెచ్చరించింది.