బెంగుళూరుకు చెందిన ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ ‘రివర్’ తన తొలి స్కూటర్ ‘ఇండీ’ని లాంచ్ చేసింది. దీని ధరను 1.25 లక్షలు. డెలివరీలు ఆగస్టు నుంచి ప్రారంభం కానుండగా, రూ.1250తో బుక్ చేసుకోవచ్చని కంపెనీ ప్రకటించింది. ‘ఇండీ’ గరిష్ట వేగం 90 కి.మీ. 4kwh బ్యాటరీ సామర్థ్యం కలిగిన ఈ స్కూటర్ ఓసారి పూర్తి ఛార్జింగ్ చేస్తే 120 కి.మీ ప్రయాణించొచ్చు. ఇందులో 3 రైడింగ్ మోడ్స్ (ఎకో, రైడ్, రష్) ఉన్నాయి. ప్రామాణిక ఛార్జర్ తో 5 గంటల్లో 80 శాతం ఛార్జ్ చెయ్యొచ్చు.