ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ హౌజ్ లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఢిల్లీ మేయర్ గా ఆప్ అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్ ఎన్నికైన తర్వాత బీజేపీ, ఆప్ కౌన్సిలర్లు వాగ్వాదానికి దిగారు. మహిళా కౌన్సిలర్లు కొట్టుకున్నారు. స్టాండింగ్ కమిటీ సభ్యుల రహస్య ఓటింగ్ జరిగినప్పుడు ఆప్ కౌన్సిలర్లు ఫొటోలు తీసినట్లు వచ్చిన ఆరోపణ నేపథ్యంలో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.