పండ్లలో మనకు విరివిగా దొరికేది జామకాయ. అతి తక్కువ ధరకే దొరికే జామకాయలను తింటే కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్ని కావు. జామపండ్లలో విటమిన్ ‘సి' పుష్కలంగా ఉంటుంది. దీనితో పాటు ఇందులో విటమిన్ ఎ, విటమిన్ బి, కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, ఐరన్, ఫోలిక్‌యాసిడ్ వంటివి మెండుగా ఉన్నాయి. అంతేకాదు జీర్ణశక్తిని పెంపొందించే ఫైబర్ ఇందులో నిండుగా ఉంది. కొవ్వు మెటబాలిజంను ప్రభావితం జేసే "పెక్టిన్" జామలో లభిస్తుంది. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించి, పేగుల్లో ప్రోటీన్ పరిశుభ్రతను పరిరక్షించడంలో సహకరిస్తుంది.