పశువులకు కూడా బీమా పథకం ఉంది. దీనిని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దాని పేరే పశువుల బీమా పథకం. పాడి ఆవులు, గేదెలు, దూడలు, పడ్డలు, ఎద్దులకు బీమా సదుపాయం ఉంది. ఈ బీమా తీసుకోవాలంటే పశువు అప్పటి మార్కెట్ విలువ మొత్తంలో ఏడాదికి 4 శాతం ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. పశువు ప్రమాదవశాత్తూ మరణిస్తే బీమా చేసే సమయానికి ఉన్న ఆ పశువు మార్కెట్ విలువను పరిహారంగా ఇస్తారు. పాలు ఇవ్వని వాటికి మార్కెట్ విలువలో 75 శాతమే ఇస్తారు.