అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మెట్లపై నుంచి జారి పడిపోబోయారు. ఉక్రెయిన్, పోలాండ్ పర్యటన ముగించుకుని బైడెన్ అమెరికాకు బుధవారం తిరిగి పయనమయ్యారు. ఈ క్రమంలో ఎయిర్ ఫోర్స్ వన్ ఎక్కే సమయంలో కాలు స్లిప్ అయ్యి మెట్లపై నుంచి జారి పడిపోబోయారు. వెంటనే తన చేతులతో నిలదొక్కుకుని ముందుకు సాగారు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa