2030 కల్లా 6 విద్యుత్ వాహన మోడళ్లను తీసుకొచ్చే యోచనలో ఉన్నట్లు మారుతీ సుజుకీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. వీటిపై ఆసక్తి పెరగాలంటే ధరలు తగ్గాలని అన్నారు. మార్కెట్ వాటా ఎంఎస్ఐ బలాల్లో ఒకటని, మా ఎస్ యూవీ విభాగంతో దీన్ని మరింత బలోపేతం చేసుకుంటామని ఆయన వివరించారు. 2022లో దేశంలో 38 లక్షల కార్లు సేల్ అవుతుంటే, 2030 కల్లా ఈ సంఖ్య 60 లక్షలకు చేరుతుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు.