దేవాలయాలకు వెళ్లేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. ఆలయం లోపలికి వాహనం గానీ, చెప్పులు గానీ వేసుకుని ప్రవేశించరాదు. ప్రదక్షిణలు చేయకుండా నేరుగా గర్భాలయంలోకి ప్రవేశించకూడదు. ఆలయంలోకి ఎప్పుడూ ఖాళీ చేతులతో వెళ్లకూడదు. పుష్ఫం, పత్రం, టెంకాయ లాంటివి తీసుకుని వెళ్లాలి. ఇతరులను దూషించడం, తిట్టడం, చెడుగా మాట్లాడడం వంటివి చెయ్యకూడదు.