టీటీడీకి ఆలయ హుండీ కానుకల ద్వారా శనివారం రూ.3.6 కోట్ల ఆదాయం వచ్చింది. వేంకటేశ్వర స్వామివారిని 76,736 మంది భక్తులు దర్శించుకున్నారు. 34,132 మంది తలనీలాలు సమర్పించారు. కాగా ఆదివారం తిరుమల కొండపై రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం 22 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేకుండా సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది.