యూకే రూర్కీ జిల్లా చూడియాలాలోని చూడామణి ఆలయంలో చోరీ చేస్తే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. అమ్మవారి పాదాల దగ్గరున్న చెక్క బొమ్మలను చోరీ చేసి బిడ్డ పుట్టిన తర్వాత అది ఎక్కడ నుంచి చోరీ చేశారో అక్కడే పెట్టాలట. దాంతో పాటు మరో బొమ్మను కూడా తీసుకురావాలని ఆలయ పూజారులు చెబుతున్నారు. ఒకప్పుడు లాందౌరా రాజు పాటించిన ఆచారమే ఇప్పటికీ ఇక్కడ కొనసాగిస్తున్నారట.