కొంతమంది నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి, వేరే వాళ్ల ప్రాణాలను బలిగొనే వార్తలు చూస్తూనే ఉంటాం. తాజాగా ఇలాంటి ఘటనకు చెందిన వీడియో బయటికి వచ్చింది. ఉత్తరప్రదేశ్ సీతాపూర్ జిల్లాలో ఓ కారు అదుపుతప్పి ఆలయ మండపంలోకి ప్రవేశించింది. ఆ సమయంలో మండపంలో కథ వింటున్న వారిపైకి కారు దూసుకెళ్లడంతో ఒకరు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన సందన పోలీస్ స్టేషన్ పరిధిలోని మధియా గ్రామంలో జరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa