అనకాపల్లి జిల్లా విమాడుగుల మండలం ఘాటి రోడ్ జంక్షన్ , దేవరాపల్లి లో ఎరువులు షాపులపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. దేవరపల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ ఎరువులు విక్రయాలు అధిక ధరలకు అమ్మకాలు చేస్తున్నారని, ఇటీవలే రైతుల ఫిర్యాదు మేరకు, ఈ విషయమై శనివారం ఆ ఎరువుల దుకాణాలు పై విజిలెన్స్ సీఐ ఎస్. లక్ష్మోజి దాడులు నిర్వహించారు. ఇందులో భాగంగా సూర్య జనరల్ స్టోర్స్ యూరియా బస్తాల నిల్వలు, 22 బస్తాలను స్వాధీనం చేసుకొని, ఈ విషయమై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలియజేశారు. రైతులకు అమ్మిన ఎరువులు విషయంలో ఎరువుల దుకాణాలు అధిక ధరల అమ్మకాలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు. కోటా రైస్, చింతపండు, నల్ల బెల్లం అక్రమ నిల్వలు చేసి వ్యాపారాలు నిర్వహించిన, నిల్వలు పట్టుబడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే
మాడుగుల మండలంలో ఘాట్ రోడ్ జంక్షన్ లో గల ఎరువులు షాపులో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారని వ్యవసాయ అధికారి వాసుదేవరావు ఆదివారం తెలిపారు విజిలెన్స్ సిఐ కోటేశ్వరరావు ఘాట్ రోడ్ జంక్షన్ లో గల వరలక్ష్మి ఎరువుల షాప్ పై తనిఖీలు చేయగా రికార్డులో ఉన్నదాన దానికి షాపులో ఉన్న ఎరువులు కి 11 బస్తాలు తేడా వచ్చినట్లు గుర్తించారని ఏవో తెలిపారు. రైతులను మోసం చేస్తే సహించేది లేదన్నారు.