అరకులోయ పరిసర ప్రాంతంలో పొగ మంచు తీవ్రత కొనసాగుతుంది. అరకులోయ పరిసర ప్రాంతంలో ఆదివారం ఉదయం 9 గంటల వరకు పొగమంచు దట్టంగా కురిసింది. దీనితో 9 గంటల తర్వాత గాని సూర్యకిరణాలు కనిపించలేదు. అలాగే గత కొన్ని రోజులుగా ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గడంతో ఏజెన్సీ వాసులు చలికి వణుకుతున్నారు. ఎన్నడూ లేనంతగా ఫిబ్రవరి నెల చివరికావస్తున్న కూడా పొగ మంచు దట్టంగా కుడుస్తుండడంతో గిరిజనులు ఉన్ని దుస్తులు ధరిస్తూ వ్యవసాయ కూలి పనులకు వెళ్ళవలసిన పరిస్థితి నెలకొంది. వచ్చేనెల మార్చి వరకు ఈ పొగ మంచు తీవ్రత ఇలాగే కొనసాగుతుందని మన్యం గిరిజనులు చెప్తున్నారు.