ప్రముఖ వాహనాల తయారీదారు మహీంద్రా అండ్ మహీంద్రా కొత్త ఆర్ డీఈ ప్రమాణాలకు అనుగుణంగా తన స్కార్పియో క్లాసిక్ లోని ఇంజిన్లను త్వరలో అప్ గ్రేడ్ చేస్తోంది. దీంతో పాటు మహీంద్రా మిడ్-స్పెక్ వేరియంట్ ఎస్5ను కూడా విడుదల చేస్తుంది. ఈ వేరియంట్ 7, 9 సీట్ల ఆప్షన్లలో వస్తోంది. కవర్లతో కూడిన స్టీల్ వీల్స్, ఆడియో సిస్టమ్, ఎలక్ట్రానిక్ ఓఆర్వీఎంలు, డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, ఈబీడీ వంటి ఫీచర్లతో రానుంది.