సాధారణంగా టీవీ చూసేటప్పుడు ప్రకటనలు వస్తుంటాయి. 20, 30 సెకన్ల యాడ్ లు చూసేందుకే మనం చిరాకు పడుతుంటాం. ప్రపంచంలోనే అత్యంత పొడవైన టీవీ ప్రకటన ఏంటో మీకు తెలుసా? గిన్నిస్ వరల్డ్ రికార్డుల ప్రకారం 'లాస్ట్స్ ఫొరెవర్' అనే 14 గంటల యాడ్ ప్రపంచంలోనే అత్యంత పొడవైన యాడ్ గా రికార్డుకెక్కింది. ఈ యాడ్ ను ఓల్డ్ స్పైస్ రూపొందించగా, డిసెంబర్ 8, 2018న బ్రెజిల్‌లోని సావో పాలోలో ప్రసారం అయింది.