జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ నెల 12 నుంచి మే 10 వరకు కుజుడి సంచారం మిథున రాశిలో ఉండనుంది. దీని ప్రభావంతో వృషభ రాశి వారికి వైవాహిక జీవితంలో సమస్యలు, మిథున, వృశ్చిక రాశి వారికి మానసిక, ఆర్థిక సమస్యలు రావొచ్చని పండితులు చెబుతున్నారు. అలాగే ధనుస్సు రాశి వారికి ఉద్యోగంలో పని భారం, అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటున్నారు.