చంద్రబాబుపై ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని, పోలీసులు అతన్ని వదిలేసి సోషల్ మీడియాలో కామెంట్ పెట్టిన ఎంపీటీసీపై కేసు నమోదు చేయడం ఏమిటని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ప్రశ్నించారు. కాపు రామచంద్రారెడ్డిపై కూడా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ రాయదుర్గం పోలీ్‌సస్టేషనలో బుధవారం మూడున్నరగంటల పాటు బైఠాయించారు. దీంతో ఉద్రిక్తత ఏర్పడింది. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఓ పత్రిక ద్వారా వాట్సాప్ గ్రూపులలో పార్టీ కార్యకర్తల చేత పోస్టింగులు పెట్టించారు. దీనికి స్పందించిన డి హీరేహాళ్ మండలం సోమలాపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు, ఎంపీటీసీ మొండి మల్లికార్జున.. కామెంట్ పెట్టారు. దీంతో పోలీసులు మొండి మల్లికార్జునపై రాయదుర్గం పోలీ్‌సస్టేషనలో కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న కాలవ శ్రీనివాసులు.. పార్టీ కార్యకర్తలతో కలిసి రాయదుర్గం పోలీ్‌సస్టేషనకు వెళ్లారు. చంద్రబాబును కించపరుస్తూ, అనుచిత వ్యాఖ్యలు చేసిన కాపుపై కేసు నమోదు చేయాలని టీడీపీ ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు మల్లికార్జున సీఐ యుగంధర్‌కు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసే దాకా అక్కడి నుంచి కదిలేదని లేదని కాలవతోపాటు టీడీపీ నాయకులు బైఠాయించారు.