జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ నెల 11 నుంచి కొన్ని రాశుల వారికి కుజ స్తంభన తొలగిపోతుందని పండితులు చెబుతున్నారు. మేష రాశి వారు చేపట్టిన పనులన్నీ పూర్తవుతాయి. వృషభ రాశి వారికి అనారోగ్య, ఆర్థిక సమస్యలు తొలగి అంతా మంచి జరుగుతుందని చెబుతున్నారు. వృశ్చిక రాశి వారికి కుటుంబ సమస్యలు తొలగి, వివాహ ప్రయత్నాలు సఫలం అవుతాయంటున్నారు. కుంభ రాశి వారికి ఆందోళనలు తగ్గి మనశ్శాంతి కలుగుతుంది.