మద్యం తాగి వాహనం నడిపితే పోలీసులు జరిమానా విధిస్తారు. కానీ, ఐరోపాలోని బాల్టిక్ సముద్ర తీరంలో ఉన్న లాత్వియాలో అధికారులు వినూత్నంగా శిక్ష విధిస్తున్నారు. తాగి వాహనం నడుపుతూ తొలిసారి దొరికితే కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపిస్తున్నారు. కానీ, రెండోసారి పట్టుబడితే వారి కారును ఉక్రెయిన్ కు తరలిస్తున్నారు. ఇప్పటివరకు దాదారు 1200 పైగా కార్లను ఉక్రెయిన్ సైన్యానికి అందజేశామని అధికారులు తెలిపారు.