పోలీస్ స్టేషన్ ఆవరణలోనే ఓ యువకుడిని హెడ్ కానిస్టేబుల్ దారుణంగా కొట్టాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బారాబంకి జిల్లా రామ్‌నగర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో జరిగింది. రెండు వర్గాల మధ్య వాగ్వాదం జరగడంతో యువకుడిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్కడ జగదాంబ ప్రసాద్ అనే హెడ్ కానిస్టేబుల్ యువకుడిని కొట్టాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వైరల్ వీడియోపై పోలీసు సూపరింటెండెంట్ దృష్టి సారించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa