యూపీలోని దయాళ్ పూర్ వాసులు రోజూ టికెట్ కొంటారు కానీ రైలెక్కరు. దీని వెనుక బలమైన కారణం ఉంది. దయాళ్ పూర్ లో 1954లో రైల్వేస్టేషన్ ఏర్పాటు చేశారు. అయితే, ఆదాయం లేకపోవడంతో 2006లో ఈ స్టేషన్ ను మూసివేశారు. గ్రామస్థుల సుదీర్ఘ పోరాటంతో 2022లో తిరిగి తెరిచారు. ఆదాయం లేకుంటే స్టేషన్ మరోసారి మూతపడుతుందనే భయంతో గ్రామస్తులంతా వంతుల వారీగా స్టేషన్ కు వెళ్లి టికెట్లు కొని రైలెక్కకుండానే వెళ్లిపోతుంటారు.