మాచెర్ల నియోజకవర్గం, దుర్గి మండలం అడిగొప్పల గ్రామంలో పల్నాట ప్రసిద్ధి చెందిన అడిగోప్పల శ్రీనిదానంపాటి అమ్మవారి జాతరకు కానుకల రూపంలో రూ. 36, 20, 304 వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీగిరిరాజుల నరసింహబాబు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా భక్తులు అందజేసిన కానుకలను జిల్లా దేవాదాయశాఖ సహాయ కమిషనర్, జాతర ప్రత్యేక అధికారి సత్యనారాయణరెడ్డి సమక్షంలో సోమవారం లెక్కించారు. గతేడాది కంటే రూ. 1, 51, 825 అదనంగా వచ్చినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో పలు ఆలయాల ఈవోలు సైదమ్మబాయి, హనుమంతరావు, సిబ్బంది పాల్గొన్నారు.