నువ్వులు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. నువ్వుల్లో ఎక్కువ ఫైబర్ ఉంటుంది. వీటి ద్వారా కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్‌లను తగ్గించవచ్చు. నువ్వులు రక్తపోటు వచ్చే అవకాశాలను తగ్గిస్తాయట. అలాగే ఎర్ర రక్తకణాల నిర్మాణంలో సహాయపడతాయి. రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తాయి. శరీర ఊబకాయాన్ని తగ్గిస్తాయి. రక్తంలోని సుగర్ ను అదుపులో ఉంచుతాయి. నువ్వులు కీళ్ల నొప్పులను తగ్గించడానికి ఉపకరిస్తాయి.