వృషభ రాశిలోకి శుక్రుడి సంచారంతో కొన్ని రాశుల వారు అప్రమత్తంగా ఉండాలని పండితులు పేర్కొంటున్నారు. మిథున రాశి వారికి వైవాహిక జీవితంలో ఇబ్బందులు, సింహ రాశి వారికి అనారోగ్య సూచనలు, వృశ్చిక రాశి వారికి మానసిక ఒత్తిడి, ధనుస్సు రాశి వారికి వ్యాపారంలో నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. మీన రాశి వారు ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుందంటున్నారు.