ysr ఆసరా మూడోవిడత చెక్కులను మార్కాపురం ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి స్థానిక ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పంపిణీ చేశారు. మొత్తం 1065 గ్రూపులకు మూడో విడత ఆసరాగా రూ.8.6 కోట్ల విలువైన చెక్కులు వచ్చాయన్నారు. ఆ మొత్తాన్ని ఎమ్మెల్యే చేతుల మీదుగా డ్వాక్రా మహిళలకు అందజేశారు. కార్యక్రమంలో పీడీ బాబురావు, ఎంపీడీవో శ్రీకృష్ణ ఈవోఆర్డీ రాజశేఖర్, మున్సిపల్ కమిషనర్ డానియోల్ జోసఫ్, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.