ఏపీ గురుకుల పాఠశాలల్లో 2023-24వ సంవత్సరానికి గానూ 5, 6, 7, 8 తరగతులతో పాటు ఇంటర్, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి ఈనెల 24వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కలకడ ప్రిన్సిపాల్, అన్నమయ్య జిల్లా కన్వీనర్ పుష్పలత కోరారు. ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2022-23 విద్యా సంవత్సరంలో 4, 5, 6, 7 తర గతులు పూర్తి చేసిన వారే అర్హులన్నారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవే శానికి 10వ తరగతి, డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులు మాత్రమే అర్హులన్నారు. ప్రవేశ పరీక్ష రాసే విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక సంవత్సర ఆదాయం రూ.లక్షకు మించకుండా ఉండాలని, లేదా తెల్లరేషన్ కార్డును కలిగి ఉండాలన్నారు. పాఠశాలల ప్రవేశ పరీక్షకు రూ.100, జూనియర్, డిగ్రీ ప్రవేశ పరీక్షకు రూ.300 చెల్లించాలన్నారు. మరిన్ని వివరాలకు ఏపీఆర్‌ఎస్.ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్.ఇన్ వెబ్ సైట్‌ను సంప్రదించాలని కోరారు.