పుట్టగొడుగులు చాలామందికి ఫేవరెట్ ఫుడ్. వీటిని పరిమితంగానే తీసుకోవాలని అధికంగా తింటే అనేక సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. తలనొప్పి, అలసట, నీరసం, గుండె, జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయని పేర్కొంటున్నారు. విరోచనాలు, వికారం, వాంతులు, కడుపు నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువని అంటున్నారు. అలాగే, చర్మానికి సంబంధించిన అలర్జీలు ఎక్కువవుతాయని కావున అతిగా తీసుకోకూడదంటున్నారు.