జామకాయ, పచ్చి మామిడి తినేటప్పుడు కొందరు ఎక్కువ రుచి కోసం ఉప్పు, కారం, మసాలా అద్దుకుని తింటారు. దీని వల్ల అనేక ఆరోగ్య సమస్యలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా తింటే పండ్లలో పోషకాలు లోపిస్తాయని, బరువు పెరుగుతారని, కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. కడుపు ఉబ్బరం, గ్యాస్ తో ఆ రోజంతా అసౌకర్యంగా ఉంటుందంటున్నారు. వేసవిలో పండ్లపై యాలకులు, మిరియాలు వేసుకోవచ్చు.