పాఠశాల నుంచి వర్సిటీ విద్యార్థుల వరకు ఆధార్ తరహా డిజి ఐడీ కార్డులు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఈ కార్డులను ఆధార్, అకాడమిక్ క్రెడిట్ తో లింక్ చేస్తారు. ఇటీవల కోర్సు మధ్యలోనే ఆపేసిన విద్యార్థులు తిరిగి చేరేందుకు, క్రెడిట్స్ ను బదిలీ చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇస్తుండడంతో డిజి కార్డును ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఈ కార్డులో విద్యార్థికి సంబంధించిన పూర్తి విద్య వివరాలు నమోదు చేస్తారు.