మార్కెట్లో 'ఐఫోన్స్'కి ఉన్న డిమాండ్ ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఐఫోన్ల ప్రేమికులకు అందుబాటులో ఉండేలా దేశంలో తన తొలి రిటైల్ అవుట్‌లెట్‌ను మంగళవారం ముంబైలో ప్రారంభిస్తుంది. తర్వాత రోజే ఢిల్లీలో తన రెండో రిటైల్ అవుట్‌లెట్‌ను స్టార్ చేయనున్నారు. మార్కెట్లో మరింత పట్టు సాధించాలనే ఉద్దేశంతో పాటు వినియోగదారులకు దీర్ఘకాలిక సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు యాపిల్ సీఈఓ టిమ్ కుక్ పేర్కొన్నారు.