హిందూ సంప్రదాయం ప్రకారం మంగళవారం హనుమంతునికి సంబంధించినది. ఈ రోజున కొన్ని పనులు చేయకూడదని పండితులు పేర్కొంటున్నారు. పదునైన వస్తువులు కొనకూడదు. మద్యం, మాంసం తినకూడదు. ఈ రోజు ఉప్పు తీసుకోకూడదు. జుట్టు, గోర్లు కత్తిరించకూడదు. అలాగే, ఇంట్లో ఎవరూ కన్నీరు పెట్టకూడదు. ఉపవాసం ఉండే వారు గోధుమలు, బెల్లంతో చేసిన ఆహారాన్ని తీసుకోవాలి.