ఈ ఏడాది ఏప్రిల్ 22 (శనివారం) అక్షయ తృతీయను జరుపుకొంటున్నారు. ఇదే రోజున పరుశురాముడి జయంతి కూడా. ఈ రోజున ముఖ్యంగా బార్లీ, గోధుమలు, శనగలు, పెరుగన్నం, చెరకు రసం, పాల ఉత్పత్తులు, తీపి పదార్థాలు, నీటితో నిండిన కలశం, ధాన్యాలు దానం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు పేర్కొంటున్నారు. ఈ రోజున లక్ష్మీదేవిని పూజిస్తే అంతా మంచే జరుగుతుంది.