వెల్లుల్లి మంచి యాంటీ ఆక్సిడెంట్. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే, కొన్ని సమస్యలున్న వారు వెల్లుల్లి తినకూడదని సూచిస్తున్నారు. మధుమేహ రోగులు, జీర్ణ, కాలేయ సమస్యలున్న వారు వెల్లుల్లికి దూరంగా ఉండాలి. వెల్లుల్లిని నేచురల్ బ్లడ్ థిన్నర్ (రక్తాన్ని పలుచగా మార్చేస్తుంది) అంటారు. అందుకే కొత్తగా శస్త్రచికిత్స చేయించుకున్న వారు దీన్ని తినకూడదంటున్నారు.