పదోతరగతి ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ టెన్త్ ఫలితాలను రిలీజ్ చేశారు. విద్యార్థులు bse.ap.gov.in. వెబ్సైట్ ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6,05,052 మంది పరీక్షలకు హాజరు కాగా.. వీరిలో బాలురు 3,09,245, బాలికలు 2,95,807మంది ఉన్నారు. ఫలితం ఏదైనా విద్యార్థులు ధైర్యంగా ఉండాలని, తల్లిదండ్రులు వారికి సపోర్ట్‌గా నిలవాలని అధికారులు సూచించారు.