గుంటూరు జిల్లాలో ఐదు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు అత్యధికంగా చేబ్రోలు మండలంలో 77 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో మండలంలో జొన్న, మొక్కజొన్న మిర్చి పంటలకు తీవ్రంగా నష్టం వాటిలిందని అధికారులు అంచనా వేశారు. పొన్నూరు వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలోని పొన్నూరు, చేబ్రోలు, పెద కాకాని మండలాలలో పంట నష్టం అంచనాలు చేపడుతున్నట్లు పొన్నూరు ఏ డి ఏ సి హెచ్ తిరుమల దేవి శనివారం తెలిపారు.