పొరపాటున ఫోన్ నీళ్లలో పడితే వెంటనే బయటకు తీసి స్విచ్చాఫ్ చేయాలి. ఫోన్ కేస్, సిమ్ కార్డ్, రిమూవబుల్ బ్యాటరీ అయితే దాన్ని కూడా తీసెయ్యాలి. ఫోన్ అధికంగా రుద్దకుండా గుడ్డ లేదా పేపర్ టవల్ లో ఆరబెట్టాలి. ఫోన్ పొడి ప్రదేశంలో ఉంచాలి. ఫోన్ ను బియ్యంలో ఉంచితే కొంతవరకు నీటిని గ్రహించే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ఫోన్ పూర్తిగా ఆరితేనే స్విచ్చాన్ చేయాలి. ఆన్ కాకుంటే ఛార్జింగ్ పెట్టి మళ్లీ ఆన్ చేయాలి.