వాట్సాప్‌లోనూ ట్రూకాలర్ సేవలను ప్రారంభించనున్నట్లు ట్రూకాలర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అలన్ మమెది తెలిపారు. గత రెండు వారాలుగా భారత్‌లో వాట్సాప్ ద్వారా స్పామ్ కాల్స్ వస్తున్నాయనే ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. కావున మెసేజింగ్ యాప్‌లలోనూ తమ సేవలు అందుబాటులోకి తేవాలనుకుంటున్నట్లు ప్రకటించింది. అయితే AI ఉపయోగించి స్పామ్ కాల్స్‌ను నివారించాలని కేంద్రం టెలికం కంపెనీలకు సూచించింది.