జగన్ ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. త్వరలో మత్స్యకార భరోసా నిధులు విడుదల చేయనుంది. బాపట్ల జిల్లా నిజాపట్నంలో ఈనెల 15న వైఎస్ఆర్ మత్స్యకార భరోసా నిధులను సీఎం జగన్ విడుదల చేయనున్నారు. కంప్యూటర్ బటన్ నొక్కటం ద్వారా లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమ చేయనున్నారు. కాగా, ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు సముద్రంలో వేట నిషేధ సమయంలో ఉపాధి కోల్పోయిన మత్స్యకారులకు ప్రభుత్వం రూ.10వేల భృతిని అందిస్తుంది.