ఆగ్నేయ బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ అల్పపీడనం మంగళవారం వాయుగుండంగా మారి ఉత్తర, ఈశాన్య దిశగా బంగ్లాదేశ్, మయన్మార్ తీరాల వైపు పయనించే అవకాశం ఉందని IMD వెల్లడించింది. దీంతో ఏపీపై మోచా తుపాన్ ప్రభావం ఉండదని స్పష్టం చేసింది. ఫలితంగా రానున్న మూడు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.