ఢిల్లీ మద్యం కుంభకోణం ఓ బూటకమని ఆప్ ముఖ్యనేత, ఢిల్లీ మంత్రి ఆతిషి అన్నారు. ED, CBI చార్జిషీట్లోని స్క్రిప్ట్ PMO నుంచే రాస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ కేసులో లావాదేవీలపై ED, CBI వద్ద ఆధారాలు లేవని స్వయంగా కోర్టు అభిప్రాయపడిందని గుర్తు చేశారు. ఏడాదికాలంగా ఆరోపణలే తప్పా అంతకుమించి ఈ కేసులో ఏమీ లేదని ఎద్దేవా చేశారు. కుంభకోణం ఆరోపణలు చేసిన బీజేపీ నేతలు క్షమాపణలు చెప్పాలని ఆతిషి డిమాండ్ చేశారు.