ఉత్తరప్రదేశ్లోని ఖేరి జిల్లా మితౌలీలో ఓ వ్యక్తి ప్రతీకారంతో బెయిల్ ఇప్పించి మరీ చంపేశాడు. కాశీ దంపతులకు జితేంద్ర(14) కొడుకున్నాడు. అయితే 2020లో ఓ హత్య కేసులో కాశీ జైలుకెళ్లాడు. తర్వాత కాశీ భార్యతో సమీప బంధువు శత్రుధన్ లాలా (47)తో అక్రమ సంబంధం ఉంది. తమకు అడ్డుగా ఉన్న జితేంద్రను చంపేయడంతో ఇద్దరూ జైలుపాలయ్యారు. ఇటీవల కాశీ జైలు నుంచి విడుదల కాగా, లాలాను బెయిల్పై బయటకు తీసుకొచ్చి మరీ కాల్చి చంపాడు.