మెటాలో మరో రౌండ్ లే ఆఫ్స్ మొదలు కానున్నాయి. కొన్ని నివేదికల ప్రకారం ఈసారి దాదాపు 6 వేల మందిని ఇంటికి పంపనున్నట్లు సమాచారం. వచ్చే వారంలో ఈ ప్రక్రియ మొదలవుతుందని తెలుస్తోంది. గతేడాది నవంబర్ లో 11 వేల మందిని, ఈ ఏడాది మార్చిలో 10 వేల మందిని మెటా సంస్థ తొలగించింది. ఇప్పటికే ఫేస్ బుక్ లో 4 వేల మందిని తొలగించింది. ప్రస్తుతం లేఆఫ్స్ మార్గం తప్ప మరేదీ కనిపించడం లేదని కంపెనీ గ్లోబల్ అఫైర్స్ ప్రెసిడెంట్ నిక్ క్లెగ్ చెప్పారు.