కిడ్నీలు మన శరీరంలో ఎంతో కీలకమైన అవయం. శరీరంలో ఎప్పటికప్పుడు పేరుకునే వ్యర్థాలను కిడ్నీలు బయటకు పంపుతాయి. కిడ్నీలను ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా అది ప్రాణాంతకంగా మారుతుంది. మనం తీసుకునే ఆహారం, నీటితోనే మూత్రపిండాలను జాగ్రత్తగా కాపాడుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. రెడ్ క్యాప్సికమ్ కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. వీటిలో పొటాషియం తక్కువగా ఉంటుందని ఓ అధ్యయనం వెల్లడించింది. ఇందులో విటమిన్లు ఎ, సి, బి6, ఫోలిక్ యాసిడ్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు కిడ్నీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇందులో లైకోపీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది క్యాన్సర్ నుంచి రక్షిస్తుంది.