ప్లస్ టు పాఠశాలల్లో అధ్యాపకులుగా పని చేయడానికి వివిధ సబ్జెక్టుల్లో ఖాళీ పోస్టుల భర్తీకి సోమవారం ధ్రువపత్రాల పరిశీలన, కౌన్సెలింగ్ ఉంటుందని డీఈవో శైలజ ఒక ప్రకటనలో తెలిపారు. పోస్టులను ఉమ్మడి గుంటూరు జిల్లావ్యాప్తంగా భర్తీ చేయనున్నారు. అర్హులైన స్కూల్ అసిస్టెంట్లు సోమవారం ఉదయం 10గంటలకు గుంటూరు జిల్లా డీఈవో కార్యాలయానికి హాజరుకావాల్సి ఉంటుంది.