నల్ల మిరియాల వల్ల అనేక రకాల వ్యాధులు దూరం అవుతాయి. కడుపునొప్పి, గ్యాస్, ఎసిడిటీ లాంటి సమస్యలతో బాధపడేవారు నిమ్మరసంలో చిటికెడు మిరియాల పొడి, బ్లాక్ సాల్ట్ కలిపి తాగితే అద్భుతంగా పనిచేస్తుంది. నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే నల్ల మిరియాల పొడి తీసుకుంటే ఒత్తిడి, నిరాశ వంటివి తొలగుతాయి. జలుబు, దగ్గు, కఫంతో బాధపడేవారు నల్లమిరియాల పొడి వేసిన చారు తిన్నట్లయితే ఎంతో మేలు జరుగుతుంది.