యూజర్లకు వాట్సాప్ గుడ్ న్యూస్ అందించింది. తాజాగా మరో సరికొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. యూజర్లు ఇతరులకు పంపిన మెసేజ్‌లను ఎడిట్ చేసుకునే సౌలభ్యం కల్పించినట్లు వాట్సాప్ సోమవారం ప్రకటించింది. పంపిన మెసేజ్‌పై ఎక్కువ సేపు నొక్కి ఉంచాలి. ఆపై కనిపించే ఎడిట్ ఆప్షన్ ఎంచుకోవాలి. తర్వాత మెసేజ్‌లో మార్పులు, చేర్పులు చేసుకోవచ్చు. మెసేజ్ పంపిన 15 నిమిషాలలోపు మాత్రమే ఎడిట్ ఆప్షన్ ఉపయోగించుకోవచ్చు.