బెెంగళూరులో ఓ మహిళ అందించిన చీర ఐదుగురి ప్రాణాలు కాపాడింది. భారీ వర్షాల ధాటికి కేఆర్ కూడలి సమీప అండర్ పాస్‌లో ఓ కారు మునిగిపోయింది. ఓ మీడియా ప్రతినిధి నీటిలో ఈత కొడుతూ కారులో ఉన్నవారిని రక్షించడానికి తాడు లాంటిది కావాలని అడగ్గా అక్కడున్న వారెవరూ సహకరించలేదు. కానీ ఓ మహిళ తన చీరను తీసి ఇచ్చింది. అండర్ పాస్‌కు ఉన్న ఇనుప ఊచలకు కట్టిన ఆ చీరతో ఒక్కొక్కరుగా బయటకు రాగలిగారు. ఆ మహిళ చూపిన తెగువకు అక్కడి వారంతా అభినందించారు. అయితే ఈ ఘటనలో ఐదుగురిని రక్షించగా ఓ యువతి మాత్రం చనిపోయింది.