ముఖంపై వృద్ధాప్య లక్షణాలు నిర్ణీత వయసు దాటాక వస్తాయ. కానీ కొన్ని అలవాట్లు వల్ల 40 ఏళ్లకే ఆ లక్షణాలు కనిపిస్తాయి. బిజీ లైఫ్ స్టైల్ లో కొందరు సరిగా నిద్రపోరు. దీంతో ముఖంపై ముడతలు, కంటి కింద నల్లటి వలయాలు ఏర్పడుతాయి. వేళ కాని వేళల్లో తినడం, అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. స్మోకింగ్ ఆరోగ్యానికి అత్యంత హానికరం. ప్రస్తుత పరిస్థితుల్లో ఒత్తిడి సర్వసాధారణమైపోయింది. దీనిని దూరం చేయడం చాలా అవసరం.